TG: జూబ్లీహిల్స్‌లోని CM రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు బందోబస్తు నిర్వహించిన బెటాలియన్ పోలీస్ సిబ్బందిని CM సెక్యూరిటీ వింగ్ తప్పించింది. వారి స్థానంలో AR సిబ్బందితో భద్రత కల్పించింది. ఇంటికి 3 వైపులా ఉన్న 22 మంది TGSP సిబ్బందిని మార్చి AR సిబ్బందిని నియమించారు. కొన్ని రోజులుగా బెటాలియన్ పోలీసులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చేశారు.