దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా కూడా ‘సూపర్ డిలైట్ డేస్’ పేరుతో కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా తన కంపాక్ట్ SUV కారు హ్యుండాయ్ వెన్యూపై భారీగా ఆఫర్ ప్రకటించింది. ఈ కారుపై రూ.80 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే, ఎక్స్టర్పై రూ.42,972, ఐ20పై రూ.55 వేల వరకు సేవ్ చేయవచ్చు. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.