AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10:45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజులపాటు పులివెందులలో ప్రజలకు జగన్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.