ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐన్యూస్ MD శ్రావణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. జస్టిస్ శ్రీదేవి విచారణ జరిపారు. ఈ కేసులో శ్రావణ్‌కు సంబంధం లేదని, నిందితుల వాంగ్మూలాల్లో వాస్తవం లేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొంటూ.. పోలీసుల దర్యాప్తునకు శ్రావణ్ సహకరిస్తారని తెలిపారు. దీంతో శ్రావణ్ పిటిషన్‌పై పోలీసులకు నోటీసులు జారీచేశారు.