Prabhas : బాహుబలి తర్వాత భారీ సీక్వెల్ సినిమాలు ఊపందుకున్నాయి. బాహుబలి రేంజ్లో వచ్చిన కెజియఫ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పుష్ప2 వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.
బాహుబలి తర్వాత భారీ సీక్వెల్ సినిమాలు ఊపందుకున్నాయి. బాహుబలి రేంజ్లో వచ్చిన కెజియఫ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ప్రస్తుతం పుష్ప2 వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ప్రభాస్ సీక్వెల్ మూవీ చేస్తే.. బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఉంది. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సలార్ మూవీ.. రెండు భాగాలుగా రాబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు సలార్ 2 కన్ఫామ్ అయినట్టేనని అంటున్నారు. దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసినట్టే. కొరటాల ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే.. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ ప్రాజెక్ట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హృతిక్ రోషన్ ‘వార్2’లో ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడనే వార్త బయటకి వచ్చింది. అంతేకాదు.. సెప్టెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఇదే నిజమైతే.. ఎన్టీఆర్ 31 కాస్త వెనక్కి వెళ్లినట్టే. ఈ లోపు సలార్ 2ని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయాడట ప్రశాంత్ నీల్. కెజియఫ్, బాహుబలి సెంటిమెంట్స్ వర్కౌట్ అయ్యేలా.. సలార్‌ను రెండు భాగాలుగా రూపొందిచాలని అనుకుంటున్నాడట. ప్రభాస్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘వార్2’ కమిట్ అవడంతో.. సలార్ 2 కన్ఫామ్ అయిపోనట్టేనని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రశాంత్ నీల్ సలార్ 2 కంప్లీట్ చేసే లోపు.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాని కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.