వంశీ ఊరికే సినిమా తీసి, రిలీజు చేసి, డబ్బులు లెక్క పెట్టుకుని కామ్‌గా ఉండే రకం కాదు. సినిమాకి తనదైన ఓ ప్రత్యేకతను అద్దడంలో ఆయనదో సెపరేట్ రూటు. ఎక్కడో అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ అనమాట.
లేటెస్ట్గా లక్కీ భాస్కర్‌తో బాక్సాఫీసుల్ని మోతమోగించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ మళ్ళీ మరో బాక్సాఫీసు హీట్‌కి రెడీ అవతున్నారు. డిజెటిల్లు, టిల్లుస్క్వేర్, గేంగ్స్ ఆఫ్ గోదావరి, గుంటూరు కారం ఇలా వరస సినిమాలతో రెచ్చిపోతున్న నాగవంశీ మరోసారి ధియేటర్ల మీద విరుచుకుపడబోతున్నారు. ఇది ట్రేడ్ టాక్. మీడియా టాక్ కూడా దాదాపుగా అలాగే ఉంది. కానీ వంశీ ఊరికే సినిమా తీసి, రిలీజు చేసి, డబ్బులు లెక్క పెట్టుకుని కామ్‌గా ఉండే రకం కాదు. సినిమాకి తనదైన ఓ ప్రత్యేకతను అద్దడంలో ఆయనదో సెపరేట్ రూటు. ఎక్కడో అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ అనమాట. ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా మాటలు విసిరేస్తారు. అవి కూడా ఆచితూచి విసురుతారు. అదీ అందులో మజా. గతంలో కొన్ని సందర్భాలలో ఆయన మాటలు మీడియాకి తిరుగులేని ఫుడ్ పెట్టాయి. ఇప్పడు మరోసారి తాజాగా డాకూ మహారాజ్ ప్రెస్ మీట్లో గట్టి బుల్లెట్టే షూట్ చేశారు.
ఓ పాత్రికేయుడు బాలకృష్ణ గతంలో సినిమాలను గుర్తు చేస్తూ, డాకూ మహారాజ్ ఆ స్థాయిలో ఉంటుందా లేదా వాటిని మించి పోతుందా అనే అర్ధం వచ్చేలా ఏదో అడిగాడు. ఇంకా ఆ ప్రశ్న పూర్తి కాలేదు, దర్శకుడు బాబీ కాస్తంత జాప్యం చేయగానే, వంశీ గన్నెత్తారు.
‘’వాటన్నిటికన్నా అదిరిపోతుంది, కావాలంటే చూస్కోండి మీరే ఇంటర్వెల్లోనే నాకు ఫోన్ చేసి, వంశీ …అదిరిపోయింది అని చెప్పకపోతే చూడండి’’ అని చాలా దూకుడుగా మాట విసిరారు. కాసేపు మీడియా కూడా అవాక్కయింది. అంటే తన ప్రాడక్టు మీడ వంశీకున్న గొప్ప నమ్మకం అది. లేదా డైరెక్టర్ బాబీ తీసిన విధానం పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసం అది. నిజంగానే నాగవంశీ రిలీజు చేసిన విజువల్స్ దాదాపుగా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. అంటే ఇటీవల తెలుగు సినిమాలు ప్రపంచం మొత్తాన్ని కంటెంట్ రూపంలో గానీ, మేకింగ్ స్టయిల్స్ పరంగా గానీ శాసిస్తున్నాయి. వాళ్ళూ వీళ్ళు అని కాకుండా అన్ని భాషలవాళ్ళు తెలుగు సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు బాహుబలి, త్రిబుల్ ఆర్, కెజిఎఫ్, ఇటీవలి పుష్ఫరాజ్ అన్ని ప్రపంచాన్ని షేక్ చేసి, షాక్‌కి గురి చేశాయి. అదే కోవలో కనిపిస్తోంది ఈ డాకూ మహరాజ్ కూడా.
పైగా బాలకృష్ణ తిరుగులేని సక్సెస్ స్ప్రీలో దూపుసుపోతున్నారు. యోగకాలం నడుస్తోంది. ఆయన ఇటీవలి చిత్రం కూడా నేటకొండ భగవంత్ కేసరి చెలరేగిపోయింది. ఈ నేపథ్యంలో డాకూ మహారాజ్ రికార్డు క్రియేట్ చేస్తుందా లేదా అనే డిస్కషన్‌కే తావు లేదు. బాలకృష్ణకి మరో సూపర్ హిట్. నాగవంశీ మాటలు….అక్షరసత్యాలు. తధాస్తు. .