దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్ ముద్దుల తనయ పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్ చేసుకున్నారు. దీనిపై ఫ్యాన్స్‌తోపాటు అలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు స్పందించారు. ‘క్యూట్’ అంటూ లవ్ ఎమోజీలు జోడించారు.