AP: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈసారి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేశారు. 2015లో చోటుచేసుకున్న ఘటనలు విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే.