TG: రాష్ట్రంలో BRS పదేళ్లలో చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ 10 నెలల్లో చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో రూ.6.68 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. బోడుప్పల్లో వక్ఫ్ బోర్డు సమస్య కోర్టు పరిధిలో ఉందని.. అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే మేడ్చల్ నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు కేటాయించామన్నారు.