కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీలపై AICC చీఫ్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారయ్యాయని మోదీ ఎద్దేవా చేశారు.