AP: ఉండి MLA రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాకు వ్యక్తిగతంగా KCR అంటే ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. KCR పదేళ్లలో తెలంగాణ విలువను 10 రెట్లు పెంచి చూపించారు’ అని అన్నారు. కరీంనగర్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉండే ఎకరం ధర KCR హయాంలో రూ.70 లక్షలకు పెరిగిందన్నారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల కూడా భూముల విలువ బాగా పెరిగిందని వివరించారు.