ఒడిశాలోని నైనీ కోల్బ్లాక్కు అన్ని అనుమతులు వచ్చాయని, జనవరి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు. బొగ్గు వెలికితీతకు ముందు కోల్ బంకర్, విద్యుత్ సబ్స్టేషన్, జనరేటర్ వంటి వాటిని నెలకొల్పాలని, బొగ్గు రవాణాకు ఏర్పా ట్లు చేయాలని తెలిపారు. కొత్తగా రిక్రూట్ అయిన వారికి ఈనెల 10లోగా నియామక ఉత్తర్వు లు అందజేయాలని ఆదేశించారు.