HNK: రాష్ట్ర బీసీ కమిషన్ బృందం రాష్ట్రవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణకు చేపట్టిన పర్యటనలో భాగంగా నేడు హనుమకొండ జిల్లాకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి దామాషా ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ కోసం బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి వస్తున్నట్లు పేర్కొన్నారు.