NZB: మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మోపాల్ మండలంలోని కంజర గురుకుల పాఠశాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.