మరణించాడని ఓ యువకుడిని మార్చురీకి తరలిస్తుండగా బతికే ఉన్నా అంటూ కేకలు పెట్టిన ఘటన UPలోని ఓ వైద్య కళాశాలలో జరిగింది. మేరఠ్ జిల్లా గోట్కా గ్రామానికి చెందిన షగుణ్శర్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడని వైద్యులు నిర్ధారించగా.. శవపరిక్షకు తీసుకెళ్తుండగా బతికే ఉన్నానంటూ కేకలు వేశాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా కంగుతిన్నారు. వేంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అతడికి వైద్యం అందించారు.