TG: ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగినట్లు జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు, ఇతర వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను కూడా సమర్పించింది. ఈ ఒప్పందాలపై KCR స్వయంగా నిర్ణయం తీసుకున్నారని నిర్ధారించినట్లు సమాచారం. కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గంలో చర్చించి.. KCR సహా ఇతర నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది.