AP: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై వైసీపీ విధానం ప్రకటించింది. వైసీపీ విధానాన్ని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యురేనియం తవ్వకాలను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల నిర్ణయమే మా పార్టీ నిర్ణయం. జగన్ కూడా ప్రజల నిర్ణయం మేరకే వెళ్లాలని సూచించారు. యురేనియం తవ్వకాలను కచ్చితంగా అడ్డుకుంటాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం’ అని అన్నారు.