HYD: జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో రైలు స్టేషన్ వద్ద కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్లైఓవర్ కారణంగా స్టేషన్ నుంచి కిందికి వచ్చి రోడ్డు దాటాల్సివస్తోంది. అత్యంత రద్దీ ప్రాంతం కావడం.. రెండోవైపు ఎల్ అండ్ టీ మెట్రోకు కేటాయించిన భుములు ఉండటంతో అనుసంధానం కోసం స్కైవాక్ నిర్మించనున్నారు.