ATP: శింగనమల మండలంలోని కొత్తపల్లి వద్దనున్న సప్తగిరి క్యాంపర్ పరిశ్రమలో ప్రమాదం జరిగి అస్వస్థత గురైన కార్మికులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు. నగరంలోని కిమ్స్ సవేరా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడి నాణ్యమైన చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు.