SKLM: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం మండలంలో అలికం పంచాయతీ పరిధిలో రూ.12 లక్షల రోడ్డు నిర్మాణానికి MLA శంకర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.