AP: ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పొగొట్టుకొని అప్పులు తీర్చలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భరత్ అన్లైన్లో గేమ్స్ ఆడి అప్పుల పాలయ్యాడు. అవి తీర్చలేక తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.