CTR: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలమనేరు పట్టణంలోని వివిధ లాడ్జిలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఎస్సై స్వర్ణతేజ తెలిపారు. ఈ సందర్భంగా లాడ్జ్ నిర్వాహాకులు పలు సూచనలు చేశారు. రిజిస్టర్ను సక్రమంగా మైంటైన్ చేయాల్సిందిగా కోరారు. అసాంఘిక కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.