TG: నల్లగొండలోని ఓ అపార్ట్మెంట్లో కానిస్టేబుల్ రవిశంకర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి సెలవులు తీసుకుని కానిస్టేబుల్ నల్లగొండకు వెళ్లినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.