TG; నల్గొండలోని ఓ అపార్ట్మెంట్లో కానిస్టేబుల్ రవిశంకర్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి సెలవులు తీసుకుని కానిస్టేబుల్ నల్గొండకు వెళ్లినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.