భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. భారత్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసిన ట్రూడో ప్రభుత్వం తాజాగా సైబర్ ముప్పు దేశాల జాబితాలో ఇండియా పేరు చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్ ఇంటెలిజెన్స్‌కు పాల్పడుతోందని ఆరోపించింది. దీన్ని భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇండియా ప్రతిష్ఠను మసకబార్చాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని పేర్కొంది.