న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియానే పైచేయి సాధించింది. కివిస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లుకు 171 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆధిక్యం కేవలం 143 పరుగులే. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3, ఆకాశ్ 1, సుందర్ 1 వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 235, భారత్ జట్టు 263 రన్స్ చేసిన విషయం తెలిసిందే.