BDK: ధాన్యం కొనుగోలుపై శనివారం జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.