TG: ప్రయాణికుల కోసం TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె ప్రాతిపదికన RTC బస్సు చార్జీలను తగ్గించినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్‌ప్రెస్ రూ.7, డిలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమలకు, శుభముహుర్తాలకు అద్దెకు RTC బస్సులను బుకింగ్ చేసుకొని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.