TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం కేరళకు వెళ్లారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ కుమార్తె పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ఎర్నాకులమ్ వెళ్లారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి ఉన్నారు. పెళ్లి వేడుక అనంతరం వయనాడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక ప్రచార ర్యాలీలో కూడా వీరంతా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.