SKLM: జలుమూరు మండలం కరకవలస గ్రామానికి చెందిన పేరాడ సాయిరాం తన తల్లి అమ్మన్నకు క్యాన్సర్ ట్రీట్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుక్రవారం జరిగిన ఈదుపురం గ్రామ సభలో విన్నవించుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో శనివారం రూ.1.50 లక్షలు చెక్కును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందించారు. సీఎంకు సాయిరాం కృతజ్ఞతలు తెలిపారు.