రష్యా యుద్ధానికి సహకరించేలా ఉత్పత్తులు, సేవల్ని అందిస్తూ ఆ దేశానికి సహకరిస్తున్నాయని 398 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో భారత్ కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఎగుమతి నియంత్రణ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సంబంధిత విభాగాలు, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి అమెరికా అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.