బరువు తగ్గాలని కొందరు భోజనానికి బదులు చపాతీ తింటారు. చపాతీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా చపాతీ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్, గ్లూటెన్ కారణంగా శరీరంలో కొలెస్టరాల్ పెరుగుతుందట. దీంతో గుండె జబ్బులు, షుగర్, అధిక బరువు సమస్యల బారిన పడే ప్రమాదముందన్నారు. థైరాయిడ్, షుగర్ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా చపాతీ తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.