ATP: గుంతకల్లు పట్టణంలోని భ్రమరాంబిక జూనియర్ కళాశాలలో శనివారం జేవీవీ ఆధ్వర్యంలో రక్తదానం అపోహలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెవీవీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చని, ప్రతి మూడు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయొచ్చు అన్నారు.