రైలు ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కేరళలోని శోరనుర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులు పారిశుద్ధ్య కార్మికులుగా రైల్వే పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని, పారిశుద్ధ్య పనుల కోసం రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు తెలిపారు.