ప్రకాశం: కొరిశపాడు మండలంలో ఈనెల నాలుగో తేదీ నుంచి 32 సంచార జాతులను గుర్తించేందుకు సర్వే జరుగుతుందని ఎంపీడీవో రాజ్యలక్ష్మి శనివారం తెలియజేశారు. వారి స్థితిగతులను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. వారి జీవనోపాధిని మెరుగుపరచడం కోసం సర్వే ప్రక్రియ జరుగుతుందని ఎంపీడీవో తెలిపారు. అలాగే హౌస్ హోల్డ్ సర్వే కూడా జరుగుతుందన్నారు.