గత కొన్నేళ్లుగా గాయాల కారణంగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఆడినా రెండు, మూడు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.