అమెరికా ఎలక్షన్లలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తున్నారు. 1990ల్లో మస్క్ అక్రమంగా అమెరికాలో నివాసం ఉన్నారని వార్తలు వచ్చాయి. అది నిజమైతే తనపై బహిష్కరణ వేటు పడొచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే డెమోక్రాట్లు గెలిస్తే తనను అణచివేసేందుకు చేయాల్సిందంతా చేస్తారని మస్క్ పేర్కొన్నారు.