BHNG: యాదగిరిగుట్టలో ఎటువంటి లైసెన్స్, పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న పనీర్ తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మున్నూమియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో పెద్ద ఎత్తున పనీర్ తయారు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. పన్నీరు కొనుగోలు చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.