NLR: గూడూరులో 1వ తేదీ నుండి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దిగువ వీరారెడ్డి పల్లికి చెందిన షేక్ అమీర్ బి మెదడులో రక్తం గడ్డ కట్టి నెల్లూరు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఆ వార్డు సచివాలయ అడ్మిన్ రమ్య నెల్లూరుకు వెళ్లి పింఛన్ నగదు అమీర్ బికి అందించారు.