TG: బీఆర్ఎస్ పాలనలో 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం అంటున్నారని.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కూడా బీఆర్ఎస్సేనని తెలిపారు. ఎన్నికల కోడ్ వల్ల నియామకపత్రాలు అందించలేకపోయామని చెప్పారు. తాము పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్ నియామకపత్రాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.