AP: అనకాపల్లి జిల్లాలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ‘సంక్రాతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రోడ్డుపై కూడా గుంత ఉండకూడదని ఆయన అన్నారు. అన్ని రోడ్లపై గుంతలు పూడ్చాల్సిందేనని ఆదేశించారు. ఆంధ్రా ఎస్కోబార్ వచ్చి రోడ్లపై గుంతలు పెట్టి వెళ్లారని విమర్శించారు. రోడ్లపై నాట్లు వేయడం, చేపలు పట్టిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మనకు కావాల్సింది అభివృద్ధి’ అంటూ వ్యాఖ్యానించారు.