TG: స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే తెలంగాణలో మళ్లీ ఎమర్జేన్సీ రోజులొచ్చాయని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే సస్పెన్షన్లు చేసే దుస్థితిలో ఉన్నామని మండిపడ్డారు. హక్కులు అడిగితే బెదిరింపులు వస్తున్నాయి.. ఇది నియంతృత్వ రాజ్యం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు పోరాటం కొత్తేమీ కాదు. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణకు అందరం కలిసి పోరాడుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.