SKLM: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అవుతుందని నరసన్నపేట ఎమ్మెల్యే అన్నారు. కంబాకాయ జంక్షన్ నుండి కరవంజీ మీదుగా జలుమూరు రోడ్డు వరకు రోడ్డు మరమ్మతుల పనులను రూ.40లక్షలతో శంకుస్థాపన చేసి పనులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుంతలు లేని రోడ్లు కార్యక్రమంలో భాగంగా ఈ పనులు చేపట్టామని తెలిపారు.