NZతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. గిల్(90) పరుగులు చేసి అజాజ్ పటేల్ బౌలింగ్లో అవుటై సెంచరీని చేజార్చుకున్నాడు. పంత్(60), జైస్వాల్(30), సుందర్(38*) పరుగులు చేశారు. NZ బౌలర్లలో అజాజ్ పటేల్ 5 వికెట్లు తీశాడు. ఇష్ సోధి, మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో వికెట్ చొప్పున సాధించారు.