AP: రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్న వారు మనుషులేనా అంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని సీరియస్ అయ్యారు. అలాంటి నేరాలకు పాల్పడిన ఇద్దరు, ముగ్గురిని నడిరోడ్డుపై ఉరితీస్తేనే అలాంటివాళ్లు దారికొస్తారని పేర్కొన్నారు. గంజాయి, మద్యం వల్లే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. మార్పు రాకపోతే.. అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.