WGL: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వరంగల్ బ్రాంచ్ వారిచే ఖిలా వరంగల్ మధ్య కోటలోని ప్రభుత్వ పాఠశాలలోని 150 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడే విధంగా ప్లేట్లను పంపిణీ చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ సునీల్ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.