లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ కదలికలను అమెరికాలో ఆ దేశ అధికారులు గుర్తించారు. వెంటనే ముంబై పోలీసులకు అక్కడి అధికారులు సమాచారం అందించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఇంటి బయట కాల్పుల కేసు సహా పలు కేసుల్లో అన్మోల్ ప్రమేయం ఉంది. బాబా సిద్ధిఖీ హత్యకేసు నిందితులతోనూ అన్మోల్ టచ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.