కొత్తిమీర తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణసమస్యలు ఉన్నవారు కొత్తిమీర రసం తీసుకుంటే వెంటనే రిలీఫ్ కలుగుతుంది. వీటి ఆకులు నమిలితే నోట్లో అల్సర్లు, పగుళ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. కొతిమీరలో ఉండే విటమిన్ K శరీరంలో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఎముకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధాప్యం దరిచేరదు. క్యాన్సర్, గుండె జబ్బులు రావు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.