పశ్చిమాసియాకు అమెరికా నుంచి మరింత సైనిక సామాగ్రి వెళ్లనుంది. ఈ మేరకు ఇరాన్‌కు హెచ్చరికగా సైనిక సామాగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తామని అగ్రరాజ్యం వెల్లడించింది. అందులో బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే మిషన్లు, దీర్ఘ శ్రేణి బీ2 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయని తెలిపింది. అమెరికా పౌరులను ఇరాన్, దాని ప్రాక్సీలు లక్ష్యంగా చేసుకుంటే ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకొని.. తమ ప్రజలను కాపాడుకుంటామని పేర్కొంది.