మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనే విమర్శలపై సీఎం ఏక్నాథ్ షిండే తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులెవరినీ వదలిపెట్టమని తెలిపారు. ఆ ఘటనలో చాలా మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని.. కేసు మూలాలను ఛేదించే పనిలో హోంశాఖ ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.